తప్పు ఒకరిది.. జరిమానా వేరొకరికి
పెద్దపల్లిరూరల్: తప్పు చేసిన వారు కడతరు తాళ్లపన్ను.. అన్నది పాత సామెత. కానీ తప్పుచేసినోడు తప్పించుకుని.. అందుకు జరిమానాను వేరొకరికి విధించేలా మాయ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ట్రాఫిక్ పోలీసుల కళ్లు కప్పి నిబంధనలను అతిక్రమిస్తున్నారు. తమ వాహనాల నంబరుప్లేట్ల చివరను వంచడమో, నంబరుకు తెల్లరంగు రుద్ది వేరే నంబరుగా భ్రమింపజేయడమో చేస్తూ తప్పించుకుపోతున్నారు. వివరాలు.. పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ అలీ తన బైక్ (నంబరు టీఎస్ 26ఎఫ్ 9724)పై హనుమకొండ వైపు వెళ్లకపోయినా 2025 అక్టోబర్ 18న సిగ్నల్‌జంప్ చేశావంటూ అక్కడి ట్రాఫిక్ పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు. తన మొబైల్‌కు సమాచారం రావడంతో వెంటనే స్పందించిన మహబూబ్ అలీ ఈ విషయమై అక్కడి ట్రాఫిక్ పోలీసు అధికారులకు సమాచారం అందించాడు. అది తన బైక్ కాదని, వేరొకరు ఇదే నంబరు బైక్‌పై తిరుగుతున్నారేమో అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. తర్వాత అక్కడి పోలీసులు సిగ్నల్ జంప్ చేసిన బైక్ నంబరు (టిఎస్26 ఎఫ్ 9722) అని నిర్ధారించుకున్నామని, జరిగిన పొరపాటును సవరిస్తామంటున్నారే తప్ప.. ఇప్పటికీ తన పేరిట చలాన్ అలాగే ఉందని బాధితుడు వాపోతున్నాడు. ఇప్పటికై నా ట్రాఫిక్ పోలీసులు తన పేరిట ఉన్న చలాన్‌ను తొలగించాలని కోరుతున్నాడు.
అధికారులకు ఫిర్యాదు చేసినా సవరించని వైనం
తప్పు ఒకరిది.. జరిమానా వేరొకరికి


