నవోదయలో రోబోటిక్ ఎక్స్‌పో
చొప్పదండి: పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో గురువారం విద్యార్థులు రోబోటిక్ ఎక్స్‌పో ప్రదర్శనను నిర్వహించారు. ఎంఈవో మోహన్ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రదర్శనను జగిత్యాల జిల్లా నవోదయ విద్యార్థులతో పాటు, చొప్పదండిలోని బాలుర ఉన్నత పాఠశాల, కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు తిలకించారు. మారిన పరిస్థితుల్లో సెన్సార్ సాంకేతికతతో ట్రాఫిక్ నియంత్రణ ద్వారా ప్రమాదాలను అరికట్టడంపై ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. స్మార్ట్ హోం విధానం, స్మార్ట్ ఇరిగేషన్ విధానం, ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాన్ని ముందుగా పసిగట్టడం వంటి ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీశాయి. ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి, హెచ్‌ఎం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


