స్పెల్–బీ ఫైనల్‌కు విద్యార్థిని ఎంపిక
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ మానేరు హగ్స్ అండ్ హర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని జి.ప్రణవిరెడ్డి ఇటీవల సాక్షి మీడియా గ్రూప్స్ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించిన స్పెల్–బీ సెమీఫైనల్‌లో రాణించి ఫైనల్‌కు ఎంపికై ంది. హైదరాబాద్‌లో ఈనెల 24న జరగనున్న ఫైనల్ రౌండ్‌లో పాల్గొంటారు. ప్రణవిరెడ్డిని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, హగ్స్ అండ్ హర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన కురుకుంట్ల అనంతయ్య (68) ఆర్టీసీ బస్సు ఢీకొని మృతిచెందాడు. అనంతయ్య, భార్య మల్లవ్వతో కలిసి మండల కేంద్రంలోని మణికంఠ ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తూ.. అక్కడే ఉంటున్నారు. మండల కేంద్రంలోని రెండో బైపాస్‌లో ఉంటున్న తన బంధువుల ఇంటికి గురువారం తన ద్విచక్రవాహనంపై వెళ్లి.. తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో సిరిసిల్ల –కామారెడ్డి ప్రధాన రహదారిపైకి వస్తుండగా కామారెడ్డి నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దూరంగా ఎగిరిపడ్డ అనంతయ్య తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లాడు. వెంటనే స్థానికులు ప్రథమ చికిత్స అనంతరం సిరిసిల్ల కు తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య మల్లవ్వ, కుమారుడు ప్రసాద్ ఉన్నారు. బస్సును పోలీస్‌స్టేషన్ వద్ద ఉంచి డ్రైవర్ పరారయ్యాడు. మృతుడి కుటుంబానికి ఆర్టీసీ ద్వారా నష్టపరిహారం అందించాలని ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ బందారపు బాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు.
యువకుడిపై కత్తితో దాడి
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దుంపల వినీత్‌పై అదే గ్రామానికి చెందిన అమన్‌ఖాన్ కత్తితో దాడిచేసి గాయపర్చాడు. ఈమేరకు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు. అమన్‌ఖాన్ గురువారం వినీత్ ఇంటికి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. తాను ప్రేమించిన యువతిని ఎలా పెళ్లి చేసుకోబోతున్నావని గొడవకు దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తితో వినీత్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో వినీత్ మెడ, చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో అమన్‌ఖాన్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్పెల్–బీ ఫైనల్‌కు విద్యార్థిని ఎంపిక


