ద్విచక్రవాహనం చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని ఉస్మాన్‌పురలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. ఉదయం లేచి చూసేసరికి వాహనం లేకపోవడంతో సమీప ప్రాంతాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించగా.. ఓ దొంగ ద్విచక్రవాహనాన్ని దొంగిలించిన దృశ్యాలు పుటేజీలో రికార్డయ్యాయి. దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆలయంలో చోరీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయంలో భద్రపరచిన గరుడ వాహనాన్ని ఎత్తుకెళ్లారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. బుధవారం అర్ధరాత్రి ఆలయ తలుపులు పగులగొట్టిన దొంగలు.. రూ.60వేల విలువ చేసే గరుడ వాహనాన్ని అపహరించారు. ఉదయం అర్చకులు తలుపులు తెరిచి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఉపేంద్రచారి క్లూస్‌టీమ్‌తో పరిశీలించారు. ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
నకిలీ సుంకరి అరెస్ట్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): అసైన్డ్ భూమిని ఆన్‌లైన్ చేయిస్తానని నమ్మించి రూ.లక్షలు వసూలు చేసిన వ్యక్తిని తంగళ్లపల్లి పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు. మండలంలోని గోపాల్‌రావుపల్లికి చెందిన పురుషాని నాగరాజు తాను తహసీల్ ఆఫీస్‌లో సుంకరిగా పనిచేస్తున్నానని నమ్మించి సిరిసిల్లకు చెందిన నడిగట్ల శ్రీనివాస్ వద్ద 2022లో రూ.3.72 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్లు గడిచినా పని పూర్తి చేయకపోగా డబ్బులు అడిగితే కులం పేరుతో కేసు పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడు నాగరాజును గురువారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై ఉపేంద్రాచారి మాట్లాడుతూ నాగరాజు బాధితులు ఉంటే తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
చికిత్స పొందుతూ ఒకరి మృతి
కొత్తపల్లి: చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు గురువారం మృతిచెందాడు. కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్ కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన ఎలగందుల శ్రీకాంత్ (32) మిషన్ భగీరథ లైన్ మెన్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితుడు సాయిచరణ్ తో కలిసి బుధవారం ద్విచక్రవాహనంపై కరీంనగర్ వెళ్తుండగా, వెనుకనుంచి బొలేరో వాహనం అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెనక కూర్చున్న సాయిచరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ గురువారం మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ వివరించారు.
పోక్సో కేసు నమోదు
జగిత్యాలక్రైం:జిల్లాకేంద్రంలోని ఉస్మాన్‌పుర ప్రాంతానికి చెందిన బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. బాలిక కిరాణదుకాణానికి వెళ్తుండగా లతీఫ్ అనే వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు లతీఫ్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ద్విచక్రవాహనం చోరీ


