‘టెస్టీ’ అనారోగ్యం
కడుపులో కేన్సర్లు వస్తాయి
వీకెండ్ వస్తే... బయట బిర్యానీ ఆర్డర్ పెట్టాలి. ఇంటిలో పిల్లాడికి తినాలనిపిస్తే ఏ పిజ్జానో, ఫ్రెంచ్ ఫ్రైసో తీసుకురావాలి. కుటుంబమంతా బయటకు వెళ్తే దర్జాగా హోటల్‌లో కూర్చుని రంగురంగుల పదార్థాలు రుచి చూడాలి. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనాల వరకు బయట రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలపై ఆధారపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. కానీ ఆహార ప్రియులను మరింత ఆకర్షించేందుకు విచ్చలవిడిగా వివిధ రకాల రంగులు, టేస్టింగ్ సాల్ట్‌ను వినియోగిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆరోగ్యాలను తినేస్తోంది. రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ దుకాణాల విషయం పక్కన పెడితే.. ఇళ్లల్లో సొంతంగా చేసుకునే శుభకార్యాలల్లోని భోజనాల్లో సైతం ఈ విషపూరితమైన రంగులు, టెస్టింగ్ సాల్ట్స్ వినియోగం అధికమవుతోంది.
టేస్టింగ్‌సాల్ట్... ఫుడ్‌కలర్లతో ప్రమాదం
ఆహార పదార్థాల్లో ఎరుపు, పచ్చ, ఆరెంజ్, పసుపు రంగుల్లో టైటానియం సిలికాన్ డయాకై ్సడ్, మెటల్ ఆకై ్సడ్, నానోపార్టికల్స్ రసాయనాలు ఉంటాయి. వీటి వినియోగం వల్ల జీర్ణ కోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. బీపీ, షుగర్ పెరిగి కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. మెటాలిక్ గ్రీన్, మెటాలిక్ ఎల్లో కలర్‌లలో ఉండే కార్మోసిన్ అనే రసాయనం కిడ్నీలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చిన్నవయస్సులో కిడ్నీ ఫెయిల్యూర్, గుండెపోటుతో సహా అనేక సమస్యలకు దారితీస్తాయి. అజినోమోటో అని పిలిచే టేస్టింగ్ సాల్ట్‌తో చేసిన వంటకాలను తింటే నాడీ వ్యవస్థ బలహీనపడి పార్కిన్సన్స్, ఆల్జీమర్స్ వ్యాధులకు ప్రధాన కారణమవుతుంది. టేస్టింగ్ సాల్ట్ తీసుకునే వ్యక్తులు త్వరగా చిరాకు పడటంతో పాటు వాంతులు, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, ఛాతీపై ఒత్తిడి, గొంతులో, చేతుల్లో లేదా అరికాళ్లలో మంటలు, ఊబకాయం, గుండె ఇతర సమస్యల బారిన పడతారు. చిన్న పిల్లల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న జంక్‌ఫుడ్, పొటాటో చిప్స్, ఫ్రైడ్ చికెన్లో పరిమితికి మించి టేస్టింగ్‌సాల్ట్‌ను వాడడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్‌సెంటర్లలో టెస్టింగ్ సాల్ట్
రుచుల కోసం విచ్చలవిడిగా వినియోగం
ఆహార పదార్థాల్లో మితిమీరుతున్న రంగుల వాడకాలు
అమితంగా తినేవారిపై తీవ్ర ప్రభావం అంటున్న వైద్యులు
కరీంనగర్:
బిర్యానీలో ముక్కలు ఎర్రగా లేకుంటే కుదరదు. నూడిల్స్ ఏమాత్రం కలర్ తగ్గినా తినడానికి మనసు ఒప్పుకోదు. ఫ్రైడ్ రైస్ మెరుస్తూనే కనిపించాలి. ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ పెరిగాక జనం ఓ రకమైన ఆహారానికి అలవాటు పడిపోతున్నారు. ఇది ఆరోగ్యాలను దారుణంగా దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్ వినియోగం విషయంలో హోటళ్లు ఎక్కడా తగ్గకపోవడం.. వాటి దుష్పరిణామాలపై సామాన్యులకు అవగాహన లేకపోవడంతో.. ఆ విషాన్ని ఇష్టంగా తినేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత ఈ తరహా ఆహారానికి అలవాటు పడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
ఆహారంలో రంగులు, టేస్టి ంగ్ సాల్డ్ వినియోగం వల్ల కడుపులో కేన్సర్లు వచ్చే అవకాశం ఉంది. మితిమీరిన రంగుల వినియోగం.. రుచుల కోసం వివిధ రకాల టెస్టింగ్ సాల్ట్ వినియోగం తగ్గించాలి. జీర్ణకోశ సమస్యలతో పాటు రోగ నిరోధక శక్తిని హరిస్తాయి. జంక్ ఫుడ్లో వినియోగించే టేస్టింగ్ సాల్ట్ మరింత ప్రమాదకరం.
– డాక్టర్ దిలీప్‌రెడ్డి, సర్జికల్‌గ్యాస్ట్రో,
మెడికవర్
‘టెస్టీ’ అనారోగ్యం


