అమ్మా.. ఆలకించరూ
కరీంనగర్ అర్బన్: ప్రజావాణి పడిగాపులకు నెలవు అవుతోంది. నెలలు, ఏళ్ల తరబడి తిరిగినా పరి ష్కారం కరువవుతోందని బాధితులు వాపోతున్నా రు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో వచ్చినవారే మళ్లీ మళ్లీ రావడం కనిపించింది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం గుదిబండలా మా రింది. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్‌లు అర్జీలను స్వీకరించగా పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చొరవ చూపారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, నివేశన స్థలాలు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 250 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.


