రిజర్వేషన్ల మంటలు!
అసలేం జరిగింది?
బల్దియా వార్డుల రిజర్వేషన్ కేటాయింపులు అశాసీ్త్రయంగా జరిగాయని విపక్షాల ఆరోపణ
మార్చాలని కోర్టును ఆశ్రయించిన నగరపౌరులు
జనరల్, ఎస్సీలకు అన్యాయం జరిగిందని ఆరోపణ
ఎన్నిక వాయిదా వేయాలంటున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్ నగరపాలకసంస్థలో రిజర్వేషన్లపై రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఆశావహుల సందడి, ప్రచార హోరు మొదలవుతున్న తరుణంలో డివిజన్ల రిజర్వేషన్లు అశాసీ్త్రయంగా కేటాయించబడ్డాయని విపక్షాలు గళమెత్తుతున్నాయి. నగరపాలక సంస్థలో కొత్తగా చేసిన డీలి మిటేషన్ ప్రకారం 66 డివిజన్లుగా విభజించారు. ఎన్నికల నిర్వహణకు ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో జనరల్, ఎస్సీ వర్గాలకు తీవ్ర అన్యా యం జరి గిందన్న ఆరోపణలతో బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించడం గమనార్హం. డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల కేటాయింపుల్లో న్యాయసమ్మతం లేదని, తక్షణమే సవరించి ఎన్నికలు నిర్వహించాలని వారు కోరుతున్నారు.
గంగుల వ్యాఖ్యలతో గరంగరం
మాజీ మంత్రి గంగుల కమలాకర్ రిజర్వేషన్ల ప్రక్రియ శాసీ్త్రయంగా చేయాలని, అప్పటి వరకు ఎన్నికలు వాయిదా వేయాలంటూ చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రిజర్వేషన్లలో స్పష్టత లేకుండా ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేయడం అధికార కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి పెంచుతోంది.
ఓ వైపు హడావుడి.. మరో వైపు సందిగ్ధం
ఒకవైపు డివిజన్లలో ఆశావహుల హడావుడి, ఇంటింటి ప్రచారానికి ప్రణాళికలు, మరోవైపు కోర్టు మెట్లు, నిరసన స్వరాలు, ఈ రెండింటి మధ్య కరీంనగర్ రాజకీయాలు ప్రస్తుతం సందిగ్ధ స్థితిలో నిలి చాయి. ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడతాయా? న్యాయస్థానం జోక్యంతో రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయా? అన్నది ప్రధాన చర్చగా మారింది. రిజర్వేషన్ల అంశం న్యాయపరమైనదే కా కుండా, రాజకీయంగా కీలక ఆయుధంగా మారింది. ఓటు బ్యాంకు, సామాజిక సమీకరణాలకు ఇది దోహదపడే అంశం కావడంతో అన్ని పార్టీలు వ్యూ హాత్మకంగా వినియోగించుకునే ప్రయత్నంలో ఉన్న ట్లు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరగాలంటే రిజర్వేషన్ల అంశం తేలాల్సిందే. కాగా కోర్టు స్పందనపైనే ఎన్నికల షెడ్యూల్, రాజకీయ సమీకరణలు మారుతాయనేది స్పష్టంగా కనిపిస్తోంది.
నగరపాలక సంస్థలో కొత్తగా విలీనమైన మల్కాపూర్ గ్రామం 16వ డివిజన్‌గా అవతరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో 4,300 ఓట్లు ఉండగా, అందులో 1,636 ఎస్సీ ఓట్లు ఉన్నాయి. కొత్త ఓటర్లు చేరలేదు. సరిహద్దులు మారలేదు. సమగ్ర కుటుంబ సర్వే, సీక్ సర్వే ప్రకారం కూడా ఎస్సీ జనాభానే ఎక్కువగా ఉంది. ఎస్సీ జనాభా దామాషాకు అనుగుణంగా చట్టపరంగా దళితులకు దక్కాల్సిన రాజకీయ రిజర్వేషన్లు కాంగ్రెస్ పెద్దల బంధువులకు దక్కాలన్న దురాలోచనతో ఎస్సీల పొట్ట కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ప్రతి పక్షాలే కాకుండా స్వపక్షం నుంచి కూడా బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజ్యాంగం కల్పించిన హక్కును స్వార్థ ప్రయోజనాల కోసం ఎలా వాడుకుంటారని బీఆర్‌ఎస్ బలంగా ప్రశ్నిస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు, కలెక్టర్‌కు సంపతి క్రాంతికుమార్ అనే వ్యక్తి లేఖలు రాశారు. ఇదే సమయంలో కోర్టును ఆశ్రయించారు. అంబేద్కర్‌నగర్ 27వ డివిజన్‌లో మొత్తం ఓట్లు 4,500 ఉండగా, ఇందులో 1200 ఓట్లు ఎస్సీ ఓట్లు ఉన్నాయి. ఇందులో కూడా 200 మంది ఓటర్లు వలస పోయినట్లు తెలిసింది. బీసీ ఓట్లు అధికంగా ఉండడం, ఓసీ సామాజిక వర్గానికి 900 పైగా ఓట్లు ఉన్న డివిజన్‌ను ఎస్సీ రిజర్వేషన్ చేశారంటూ అక్కడి నేతలు సైతం కోర్టు ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నారు.
రిజర్వేషన్ల మంటలు!


