రికార్డులో తిరకాసు
గ్రామ శివారులోని 21, 22 సర్వే నంబర్లలో 5.08ఎకరాల భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్న. గతంలో ఇది స్వాతంత్య్ర సమరయోధుడి భూమి కాగా అతను వేరే వ్యక్తికి విక్రయిస్తే అతని నుంచి నేను కొనుగోలు చేశాను. 1987 నుంచి కాస్తులో ఉండి పంటలు పండిస్తున్న. పట్టాదారు పాసుపుస్తకం అన్నీ ఉన్నాయి. కానీ కొన్నేళ్లుగా నిషేధిత జాబితాలో సర్వే నంబర్ వస్తుండటంతో రైతు కానీ రైతుగా మిగిలిపోయాను. కోర్టుకు వెళితే ఎన్‌వోసీ ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినా చర్యలు లేవు. – బండి శంకరయ్య, లక్ష్మిపూర్, కొత్తపల్లి


