సీఎం కప్ పోటీలు విజయవంతం చేయాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లాలో సీఎంకప్ 2026 పోటీలు విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. కలెక్టర్‌లో సోమవారం జిల్లా ఉన్నతాధికారులు, క్రీడాశాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎంకప్ పోటీలను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూడాలని సూచించారు. డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. పోటీలు జిల్లాలో నేటినుంచి ప్రారంభం అవుతాయని, 20 నుంచి 22 వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31వరకు మండల, మున్సిపాలిటీ, జోనల్, కార్పొరేషన్‌స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు అసెంబ్లీ నియోజకవర్గస్థాయి, 9 నుంచి 12 వరకు జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్‌కుమార్ పాల్గొన్నారు.
కరీంనగర్: కరీంనగర్‌లోని వెల్‌నెస్‌సెంటర్‌లో మందులు అందుబాటులో లేవని ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పెన్షనర్లతో సమావేశమైన వీరారెడ్డి వెల్‌నెస్ సెంటర్ వైద్యులతో మాట్లాడారు. అవసరమైన మందులు తెప్పిస్తామని హామీ ఇచ్చారు. ఏ డాక్టర్ ఏ రోజు వస్తారో తెలిపే వివరాలు ఫిబ్రవరి నుంచి పట్టికరూపంలో ప్రదర్శిస్తామని తెలిపారు. బ్లడ్ టెస్టింగ్ సమస్య పరిష్కరిస్తామని అన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ బాధ్యులు బుచ్చిరెడ్డి, కోల రాజమల్లు, చక్రపాణి, దామోదర్, హనుమంతరావు, రవిశంకర్ రావు, మధుసూదన్ రావు, రమేశ్‌రావు పాల్గొన్నారు.
విద్యానగర్(కరీంనగర్): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు నియమాలు పాటించాలని జిల్లా రవాఽణాధికారి శ్రీకాంత్ చక్రవర్తి సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసో త్సవాల్లో భాగంగా సోమవారం ఆర్టీసీ కరీంనగర్–1డిపోలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవింగ్ చేసేప్పుడు రోడ్డుపై ఏర్పా టు చేసిన సూచికలను గమనిస్తూ ముందుకు సాగాలన్నారు. రీజినల్ ట్రాన్స్‌పోర్టు అధారిటీ సభ్యుడు పడాల రాహుల్, ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం, ఏఎంవీఐ సరిత, డిపో మేనేజర్లు ఐ.విజయ మాధురి, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 8,000 పలికింది. క్రయ విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్‌లోని హెచ్‌డీబీ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగావకాశాలకు ఈనెల 22న కరీంనగర్ కశ్మీర్‌గడ్డలోని ప్రభుత్వ ఈ సేవ కేంద్రం పైఅంతస్తులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు తెలిపా రు. ఇంటర్ అపై చదివిన 20నుంచి 30ఏళ్లలోపు వయసున్న యువతీ యువకులు అర్హుల ని తెలిపారు. 22న ఉదయం 11గంటలకు సర్టి ఫికెట్ల జిరాక్స్‌తో హాజరు కావాలని సూచించా రు. వివరాలకు 9908230384, 7207659969 నంబర్లలో సంప్రదించాలన్నారు.
సీఎం కప్ పోటీలు విజయవంతం చేయాలి
సీఎం కప్ పోటీలు విజయవంతం చేయాలి
సీఎం కప్ పోటీలు విజయవంతం చేయాలి


