సంక్రాంతి పురస్కారాలు
కరీంనగర్ కల్చరల్: కర్ణాటక తెలుగు రైటర్స్ ఫెడరేషన్, బెంగళూరు ఆధ్వర్యంలో నిర్వహించిన బహుభాషా కవి సమ్మేళనంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవులు వైరాగ్యం ప్రభాకర్, నూజెట్టి రవీంద్రనాథ్ సంక్రాంతి సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. బెంగళూరులోని కల్యాణ్‌నగర్ ఇండో ఏషియన్ అకాడమీ వేదికపై ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీటీఆర్‌ఈ డీఆర్‌డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.జగదీశ్వరరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పి.చంద్రశేఖర్, ఆజాద్ చేతుల మీదుగా ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. వారికి పలువురు సాహితీవేత్తలు అభినందనలు తెలిపారు.


