పగలు సురసుర.. రాత్రి గజగజ..
ఆదివారం మధ్యాహ్నం వెలవెలబోతున్న తెలంగాణ చౌక్
కరీంనగర్: జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్రమైన ఎండ.. ఉక్కపోత కొనసాగుతుండగా.. రాత్రి ఒక్కసారిగా చలి పెరిగిపోతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వాతావరణంలో మార్పులతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. కొద్ది రోజులుగా పగటిపూట 32.5 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుండగా.. రాత్రి 13.8 డిగ్రీల సెల్సీయస్‌కు వాతావరణం పడిపోతోంది. దీంతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పివంటి సమస్యలతో ప్రజలు ఆస్పత్రికి వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఉదయం ఎండకు తేలికపాటి దుస్తులు ధరించి బయటకు వెళ్లిన ప్రజలు, రాత్రి చలికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అంటున్నారు. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
పగలు సురసుర.. రాత్రి గజగజ..
పగలు సురసుర.. రాత్రి గజగజ..


