శరణు శరణు మల్లన్న
గన్నేరువరం: గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మూడ్రోజులుగా జరుగుతున్న శ్రీ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం కల్యాణోత్సవంతో ముగిశాయి. చివరి రోజు మల్లన్న పెద్దపట్నాలు వైభవంగా నిర్వహించారు. వేలాదిమంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శరణు.. శరణు మల్లన్నా.. అంటూ వేడుకున్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ప్రధాన అర్చకుడు మామిడాల నాగసాయిశర్మ అధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముస్కు ఉపేందర్‌రెడ్డి, అనంతరెడ్డి, తిరుపతి, ఆలయ చైర్మన్ వరాల పర్శరాములు, ఉదయ్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో ఇసుకతో చేసిన భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి, విఘ్నేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు, సుభ్రమణ్యస్వామి సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శరణు శరణు మల్లన్న
శరణు శరణు మల్లన్న


