కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా యువజన కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు జక్కి డి శివచరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సి పల్ ఎన్నికల్లో యూత్‌కాంగ్రెస్‌కు 20శాతం టికె ట్లు కేటాయించాలని జాతీయస్థాయిలో ప్రతి పాదన ఉందన్నారు. గెలిచే అవకాశాలు ఉన్నవారికే టికెట్లు ఇస్తారని, సర్వేలో ఆ స్థాయిలో డివిజన్లలో పనితీరు ఉండాలని తెలిపారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నగర కార్యవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర కో ఇన్‌చార్జి రోషిని జైస్వాల్, ఆర్‌టీఏ సభ్యుడు పడాల రాహుల్, పంజాల కృపాసాగర్, కొమ్ము జోహార్, ముత్యం శంకర్ పాల్గొన్నారు.
జీరామ్‌జీ చట్టంతో కనీస వేతనాలకు రక్షణ
కరీంనగర్: వీబీ– జీరామ్‌జీ చట్టం ద్వారా కనీస వేతనాలకు పూర్తి రక్షణ లభిస్తుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్ కుమార్ బోనేటి అన్నారు. కరీంనగర్‌లోని రేకుర్తిలో ఆదివారం బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కార్యశాల జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కిరణ్‌కుమార్ మాట్లాడు తూ.. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్(గ్రామీణ) చట్టంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దన్నారు. వ్యవసాయం, అనుబంధ గ్రామీణ కార్యకలాపాల్లో కార్మికులను తిరిగి భాగస్వాములు చేయడం ద్వారా కొత్త చట్టం ఈ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రోగ్రాం కో జిల్లా కన్వీనర్ కరివేద మహిపాల్ రెడ్డి, బాస సత్యనారాయణ రావు, బోయినపల్లి ప్రవీణరావు, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, కన్నబోయిన ఓదెలు, భాస్కరాచారి, గుర్రాల వెంకట్‌రెడ్డి, ఆకుల రాజేందర్ పాల్గొన్నారు.
‘కరీంనగర్ అభివృద్ధి కనిపించడం లేదా?’
కరీంనగర్: కరీంనగర్‌లో ఆరేళ్లుగా జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా అని మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రహదారులు, వీధిదీపాలు, పార్కులు, వాకింగ్‌ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు, 24/7 తాగునీటి సరఫరా వంటి అభివృద్ధి పనులు కనిపించడం లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో గత ఆరు సంవత్సరాల్లో నగరపాలక సంస్థ అభివృద్ధికి దాదాపు రూ.1000 కోట్ల నిధులు తీసుకువచ్చామని, రైల్వే ఓవర్‌బ్రిడ్జి సహా ఇతర పనులకు మరో రూ.200 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కాంగ్రెస్ ఒక్క రూపాయి తేలేదన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఏం అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ముఖ్యమంత్రి నుంచి నిధులు తెచ్చి కరీంనగర్‌ను అభివృద్ధి చేసి చూపించాలని సవాల్ విసిరారు.
ఆర్టీసీని విలీనం చేయాలి
కరీంనగర్‌టౌన్: ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేయాలని కరీంనగర్–1 డిపోకు చెందిన సుమారు 100 మంది కార్మికులు పోస్ట్‌కార్డు ఉద్యమం ద్వారా ఆదివారం గవర్నర్‌కు లేఖలు పోస్ట్ చేశారు. అంతకుముందు డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని, విడుదల చేయాలన్నారు. కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ ఎంపీ రెడ్డి, జేఏసీ కన్వీనర్ కొమురయ్య, కేతిరి శంకర్‌రెడ్డి, కరీంనగర్ జేఏసీ సభ్యులు దొంత రాజయ్య, మనోహర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి
కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి


