సాంచాలు నడవకపాయె.. అప్పులు పెరిగిపాయె | - | Sakshi
Sakshi News home page

సాంచాలు నడవకపాయె.. అప్పులు పెరిగిపాయె

Dec 3 2025 8:01 AM | Updated on Dec 3 2025 8:01 AM

సాంచాలు నడవకపాయె.. అప్పులు పెరిగిపాయె

సాంచాలు నడవకపాయె.. అప్పులు పెరిగిపాయె

వివాహిత..

సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్లఅర్బన్‌: అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేట జ్యోతినగర్‌కు చెందిన బోడ శేఖర్‌ (38) తనకున్న సాంచాలు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రస్తుతం సాంచాలు సరిగా నడవక, చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం ఉరేసుకున్నాడు. ఘటన స్థలం వద్ద పోలీసులకు మృతుడి సూసైడ్‌ నోట్‌ లభించింది. మృతుడికి భార్య లావణ్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇంటర్‌ విద్యార్థి..

సుల్తానాబాద్‌రూరల్‌: పెద్దపల్లి జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి ఎనగంటి రికిత(18) మంగళవారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై చంద్రకుమార్‌ కథనం ప్రకారం.. రికిత కరీంనగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ చదువుతోంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. సమస్య తీవ్రం కావడంతో భరించలేక బలవన్మరణానాకి పాల్పడినట్లు తల్లి రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన కుమ్మరవేణి లత (28) ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కొద్దిరోజులుగా లత మానసిక పరిస్థితి సరిగా ఉండడం లేదు. మంగళవారం భర్త నాగరాజు వ్యవసాయ పనులకు వెళ్లిన తర్వాత ఇంటి లోపల తలుపులకు గడియ వేసుకొని ఉరేసుకుంది. పొలం పనుల నుంచి భర్త తిరిగి వచ్చిన అనంతరం చుట్టుపక్కల వారితో తలుపులను బలవంతంగా తెరిచి చూడగా ఆమె మరణించి ఉంది. మృతురాలికి ఐదేళ్ల బాబు ఉన్నాడు. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు.

శబరిమలకు స్పెషల్‌ రైళ్లు

రామగుండం: శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు తెలంగాణ రైల్వే ఫోరం ప్రతినిధి కంకటి ఫణికుమార్‌ తెలిపారు. సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌–కొల్లాం(07117) ఈనెల 13న ఉదయం 10 గంటలకు కాగజ్‌నగర్‌లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్‌, కేసముద్రం, మహబూబాబాద్‌, ఖమ్మం, విజయవాడలో ఆగుతుంది. నాందేడ్‌–కొల్లాం(07123) మధ్య ఈనెల 24 వేకువజామున 4.25 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.00 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. నిజామాబాద్‌, ఆర్మూర్‌, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్‌, కేసముద్రం, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడలో దీనికి హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement