● ఒక్కో విభాగానికి ఒక్కో నోడల్‌ అధికారి ● సహాయకులుగా అధికారులు | - | Sakshi
Sakshi News home page

● ఒక్కో విభాగానికి ఒక్కో నోడల్‌ అధికారి ● సహాయకులుగా అధికారులు

Dec 2 2025 7:30 AM | Updated on Dec 2 2025 7:30 AM

● ఒక్కో విభాగానికి ఒక్కో నోడల్‌ అధికారి ● సహాయకులుగా అధ

● ఒక్కో విభాగానికి ఒక్కో నోడల్‌ అధికారి ● సహాయకులుగా అధ

● ఒక్కో విభాగానికి ఒక్కో నోడల్‌ అధికారి ● సహాయకులుగా అధికారులు

కరీంనగర్‌అర్బన్‌: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కలెక్టర్‌ పమేలా సత్పతి ఇప్పటికే నోడల్‌ అధికారులను నియమించగా పర్యవేక్షణ పక్కాగా నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో లోపాలను దిద్దుబాటు చేస్తూ వ్యూహాత్మకంగా సాగుతున్నారు. ఇప్పటికే ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్‌లు నిర్వహించగా ఎన్నికల సిబ్బందికి శిక్షణనిచ్చారు. నోడల్‌ అధికారులుగా జిల్లా స్థాయి అధికారులను, సహాయకులుగా ఇద్దరు గ్రూప్‌–2 స్థాయి అధికారులను నియమించారు. మానవ వనరుల పర్యవేక్షణ, శిక్షణ యాజమాన్యం, రవాణా, కంప్యూటరైజేషన్‌, ర్యాండమైజేషన్‌ ఆఫ్‌ పోలింగ్‌ పర్సనల్‌, సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఐటీ, స్వీప్‌, శాంతిభద్రతల పర్యవేక్షణ, ఈవీఎం మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్టోరేజ్‌, మోడల్‌ కండక్ట్‌ ఆఫ్‌ కోడ్‌, బ్యాలెట్‌ పేపర్‌/డమ్మీ బ్యాలెట్‌/పోస్టల్‌ బ్యాలెట్‌, మీడియా, కమ్యూనికేషన్‌ ప్లాన్‌, ఓటరు జాబితా, హెల్ప్‌లైన్‌/ఫిర్యాదులు/ఎస్‌ఎంఎస్‌ మానిటరింగ్‌ సీ–విజిల్‌, అబ్జర్వర్స్‌, వెల్ఫేర్‌/పీడబ్ల్యూడీ ఓటర్స్‌, కాంటాక్టింగ్‌ మైగ్రేటరీ ఓటర్స్‌ ఇలా 13విభాగాలకు నోడల్‌ అధికారులను నియమించారు.

ఒక అధికారికి ఇద్దరు సహాయకులు

ఎన్నికల కసరత్తు, నిర్వహణ, పర్యవేక్షణ క్రమంలో నోడల్‌ అధికారులుగా జిల్లా అధికారులను నియమించగా, ఒక్కో అధికారికి ఇద్దరిని సహాయకులుగా నియమించారు. మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారిగా జిల్లా విద్యాధికారి, బ్యాలెట్‌ బాక్సుల నిర్వహణ డీపీవో, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారిగా ఏవో(డీపీవో), ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారిగా జిల్లా రవాణా శాఖ అధికారి, ట్రైనింగ్‌ మేనేజ్‌మెంట్‌ డీపీవో, ఎక్స్‌పెండెచర్‌ మానిటరింగ్‌, ఎంసీవోసీ నోడల్‌ అధికారిగా డీఆర్వో, బ్యాలెట్‌ పేపర్‌ నోడల్‌ అధికారిగా ఏవో(డీపీవో), పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారిగా డీఆర్డీవో, మీడియా నోడల్‌ అధికారిగా డీపీఆర్వో, ఎక్స్‌పెండెచర్‌ మానిటరింగ్‌ నోడల్‌ అధికారిగా డీడీ స్టేట్‌ ఆడిట్‌, పరిశీలన నోడల్‌ అధికారిగా డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌(ఎన్‌ఐసీ), రిపోర్ట్స్‌, రిటర్న్స్‌ నోడల్‌ అధికారిగా డివిజనల్‌ పంచాయతీ అధికారి(హుజూరాబాద్‌), హెల్ప్‌లైన్‌, కంప్లయిట్స్‌ నోడల్‌ అధికారిగా జెడ్పీ డీసీఈవోలను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement