రెండో రోజు నామినేషన్ల జోరు
● సర్పంచ్‌కు 289, వార్డులకు 629
కరీంనగర్: తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా.. తొలిరోజు అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. రెండో రోజు శుక్రవారం చొప్పదండి, గంగాధర, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లోని 92 గ్రామ పంచాయతీలు, 866 వార్డులకు జోరుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఐదు మండలాల్లో 92 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు 197మంది 289 నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు సభ్యులుగా 866 స్థానాలకు 553 మంది 629 నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్‌కు చొప్పదండి మండలంలో 48 నామినేషన్లు, గంగాధరలో 99 నామినేషన్లు, రామడుగు 74, కరీంనగర్‌రూరల్ 35, కొత్తపల్లి 33 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డులకు గాను చొప్పదండి మండలంలో 80, గంగాధరలో 246, రామడుగులో 142, కరీంనగర్‌రూరల్‌లో 73, కొత్తపల్లిలో 88 నామినేషన్లు దాఖలయ్యాయి.


