ఆసిఫ్‌నగర్, ఎలగందుల, ఖాజీపూర్, శ్రీరాములపల్లి, కమాన్‌పూర్ గ్రామ శివారులే కాకుండా ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ గ్రానైట్ చూర్ణం (స్లర్రీ) అన్‌లోడ్ చేస్తున్నారు. రోడ్ల పక్కన, ఖాళీ స్థలం అనేకాకుండా ప్రభుత్వ భూముల్లో సైతం డస్ట్ అన్‌లోడ్ చేస్తుండగా, సంబంధిత రెవెన్యూ అధికారులు కనీసం అభ్యంతరం తెలిపే పరిస్థితుల్లో లేకపోండం శోచనీయం. గ్రానైట్ మాఫియా రాజకీయ పలుకుబడికి అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఆ స్లర్రీ ఎండిన అనంతరం వెదజల్లుతున్న చూర్ణంతో అనేక మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. చలికాలం అయితే దుమ్ముతో మరింత ఇబ్బంది ఏర్పడుతోంది. ఇక్కడి పరిసరాలన్నీ కాలుష్యమవుతున్నా పర్యావరణ అధికారులు మాత్రం మామూలుగా తీసుకొంటూ కన్నెత్తి చూడటం లేదు.


