కరీంనగర్‌కల్చరల్: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో మార్చి 20–25 వరకు జరిగిన జాతీయ సాంస్కృతిక పోటీల్లో తెలంగాణకు చెందిన ఉద్యోగ కళాకారులు ప్రతిభ చాటారు. సుమారు 25 రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో తెలంగాణ నుంచి 45 మంది కళాకారులు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించారు. జిల్లాకు చెందిన కేబీ శర్మ సంగీత సహకారం అందించగా, కాసు మహేందర్‌రాజు జానపద బృంద గీతానికి నాయకత్వం వహించారు. అగస్టీన్ రూపొందించిన శ్రీకనువిప్పుశ్రీ నాటిక జాతీయస్థాయిలో ప్రశంసలు పొందగా, వేముల ఇందిర ఉత్తమ తృతీయ నటి అవార్డు సాధించారు.


