కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

కాలుష్యం చిమ్ముతున్న పరిశ్రమలు ఎక్కడ పడితే అక్కడ డస్ట్‌ (స్లర్రీ) డంప్‌లు ప్రభుత్వ భూములను వదలని గ్రానైట్‌ మాఫియా ఇష్టారాజ్యంగా కటింగ్‌ పరిశ్రమల నిర్వహణ అదుపుతప్పిన అధికారుల నియంత్రణ వాయు, శబ్ద, నీటి కాలుష్యంతో ప్రజల అవస్థలు పత్తాలేని పర్యావరణ నియంత్రణ బోర్డు

బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
పల్లెల్లో గ్రానైట్‌ కాసారం!

7

సాక్షిప్రతినిధి,కరీనగర్‌/కొత్తపల్లి:

చ్చని పల్లెలపై గ్రానైట్‌ పరిశ్రమలు కాలుష్య విషం చిమ్ముతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ యూనిట్ల ఇష్టారాజ్యం.. అధికారుల బాధ్యతరాహిత్యం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌, ఎలగందుల, శ్రీరాములపల్లి, కమాన్‌పూర్‌తో పాటు గంగాధర మండలం ఒడ్యారం ప్రాంతాలను గ్రానైట్‌ డస్ట్‌ కమ్మేస్తోంది. గ్రానైట్‌ పరిశ్రమలతో కొత్తపల్లి మండలంలోని గ్రామాలు వాయు, శబ్ద కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. గాలిలో సూక్ష్మధూళి కణాలు అధికమై ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రానైట్‌ పాలీషింగ్‌ యూనిట్ల నుంచి దుమ్ము, ధూళితో పాటు రసాయనాలు గాలిలో కలుస్తున్నాయి. పాలీషింగ్‌ యూనిట్ల నుంచి వెలువడే వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ డంప్‌ చేస్తున్నారు. దుమ్ము, ధూళి ప్రజలతో అవస్థలు పడుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అనుమతుల్లేకుండా, పన్నులు చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమలపై అధికారులు చర్యలు చేపట్టడంపై వెనకడువేస్తుండటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రానైట్‌ పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విధంగానే జిల్లా కలెక్టర్‌ స్పందించి పరిశ్రమల అక్రమాలపై నిగ్గు తేల్చాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

గ్రానైట్‌ కటింగ్‌ పరిశ్రమలతోనే..

కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌, కమాన్‌పూర్‌, ఎలగందుల, గంగాధర మండలం ఒడ్యారం గ్రామాలు గ్రానైట్‌ పారిశ్రామిక కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అయితే వీటికి అనుబంధంగా గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమలు స్థాపించారు. ఆ పరిశ్రమల నుంచి వెలువడుతున్న గ్రానైట్‌ చూర్ణాన్ని(డస్ట్‌) ఎక్కడపడితే అక్కడ అన్‌లోడ్‌ చేస్తున్నారు. సామాజిక బాధ్యతను మరచి ప్రవర్తించడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామాల్లోని పరిసరాలు కాలుష్యంతో నిండిపోతున్నాయి. జలం, వాయు కలుషితమైన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. పంటలు దెబ్బతింటున్నాయి. పొలాల మధ్యలో గ్రానైట్‌ మిషన్లు ఏర్పాటు చేయడంతో పంటల సాగుపై ప్రభావం పడుతోంది. అంతేగాకుండా చెరువుల్లోకి గ్రానైట్‌ వ్యర్థాలు చేరడంతో చేప పిల్లలు చనిపోతున్నాయి. దీంతో మత్స్యకార్మికులు నష్టపోతున్నారు.

పత్తాలేని పర్యావరణ నియంత్రణ బోర్డు

గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమల నుంచి వెలువడ్డ డస్ట్‌ను ఎక్కడపడితే అక్కడ అన్‌లోడ్‌ చేస్తున్నప్పటికీ పర్యావరణ నియంత్రణ బోర్డు అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పర్యావరణ నియంత్రణ బోర్డు అధికారులు రామగుండంకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన డస్ట్‌(స్లర్రీ) నియంత్రణకు చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

నేడు చికెన్‌ సెంటర్లు బంద్‌

కరీంనగర్‌/విద్యానగర్‌(కరీంనగర్‌): రాష్ట్ర చికెన్‌ షాప్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన బంద్‌ పిలుపునకు జిల్లా చికెన్‌ సెంటర్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మద్దతు ప్రకటించింది. కంపెనీలు మార్జిన్‌ ఇవ్వకుండా వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లో సంఘం అధ్యక్షుడు ఎండీ నవాబ్‌ మాట్లాడారు. మార్జిన్‌ ఇవ్వని కొన్ని కంపెనీలు తమ దౌర్జన్యాన్ని కొనసాగిస్తూ చిన్న వ్యాపారులను నష్టాల్లోకి నెడుతున్నాయన్నారు. ప్ర స్తుత పరిస్థితుల్లో లాభాలు రావడం భారంగా ఉండగా, వ్యాపారం కొనసాగించడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయానికి ని రసనగా ఈనెల 1 నుంచి చికెన్‌ సరఫరా వ్యవస్థలో మార్పులు చేపడుతూ, కంపెనీలు విధించిన తక్కువ మార్జిన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌కు మ ద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. వ్యాపారుల సమస్యలను ప్రభుత్వం త క్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. చికెన్‌ వ్యాపారులకు న్యాయం జ రిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎస్వీ రాంరెడ్డి, ఉపాధ్యక్షులు ఎండీ యూనస్‌, బాలాజీ, జాయింట్‌ సెక్రటరీ రహిం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement