జిల్లా జైలు సందర్శన | - | Sakshi
Sakshi News home page

జిల్లా జైలు సందర్శన

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

జిల్లా జైలు సందర్శన

కరీంనగర్‌క్రైం: జిల్లా జైలును జిల్లా న్యాయసేవ అధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.రాణి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీల భోజన వసతులు, ఆరోగ్య సమస్యలు, జైలు క్యాంటీన్‌, ఆసుపత్రి, ములాఖత్‌, లైబ్రరీ, కిచెన్‌, జైలు ఇండస్ట్రీలను పరిశీలించారు. మహిళా జైలును సందర్శించి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్‌ న్యాయవాదులను పెట్టుకునే స్తోమత లేని ఖైదీలకు ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తామని చెప్పారు. జైలు సూపరింటెండెంట్‌ జి.విజయదేని, జైలర్లు పి.శ్రీనివాస్‌, బి.రమేశ్‌, లక్ష్మీశృతి, డిప్యూటీ జైలర్లు ఎస్‌.సుధాకర్‌రెడ్డి, ఎల్‌.రమేశ్‌, ఎస్‌.అజయ్‌చారి, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ మహేశ్‌ పాల్గొన్నారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు కరెంట్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్‌ 2 ఏడీఈ లావణ్య తెలిపారు. 11 కేవీ శ్రీరాంనగర్‌ ఫీడర్‌ పరిధి విద్యానగర్‌, కొత్తయాస్వాడ, హరిహరనగర్‌, శ్రీరాంనగర్‌కాలనీ, సాలంపుర, ఆదిత్యనగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement