పల్లె నుంచి అసెంబ్లీకి | - | Sakshi
Sakshi News home page

పల్లె నుంచి అసెంబ్లీకి

Nov 28 2025 8:47 AM | Updated on Nov 28 2025 8:47 AM

పల్లె

పల్లె నుంచి అసెంబ్లీకి

● శ్రీరాంపూర్‌ మండలం కూనారం గ్రామానికి చెందిన గీట్ల ముకుందరెడ్డి ఆ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 1983, 1989, 2004లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ● మల్లాపూర్‌ మండలం ముత్యంపేటకు చెందిన వర్ధినేని వెంకటేశ్వర్‌రావు ముత్యంపేట సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1978, 1982లో ఎమ్మెల్యేగా మెట్‌పల్లి నుంచి ఎన్నికై మంత్రిగా పనిచేశారు. ● తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన జువ్వాడి నర్సింగరావు తంగళ్లపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. సెస్‌ వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు విజయం సాధించారు. ● గంగాధరకు చెందిన న్యాలకొండ శ్రీపతిరావు గంగాధర సర్పంచ్‌గా పనిచేశారు. 1978లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా చొప్పదండి నుంచి విజయం సాఽధించారు. ● ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన చందుపట్ల రాంరెడ్డి 1970 నుంచి 1975 వరకు ఖమ్మంపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. 1999లో ముత్తారం ఎంపీపీగా, 1994లో మంథని ఎమ్మెల్యేగా ఉన్నారు.

సర్పంచ్‌గిరి.. ఎమ్మెల్యేగా గురి మంత్రులైన సర్పంచులు పల్లె నుంచే రాజకీయ తెరంగేట్రం రాజకీయ దురందరులు తొలుత సర్పంచులే..

సర్పంచ్‌లుగా మొదలై..

వార్డు సభ్యుడిగా తొలి అడుగు

రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటకు చెందిన కటుకం మృత్యుంజయం 1981లో తొలిసారి గంభీరావుపేట వార్డుసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1983లో కరీంనగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.

తండ్రీతనయులు సర్పంచులే

హుజూరాబాద్‌ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు 1981 నుంచి 1994 వరకు సింగాపూర్‌ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది 2006లో మంత్రిగా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన తనయుడు హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ 1995 నుంచి 2001 వరకు సింగాపూర్‌ సర్పంచ్‌గా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లోనూ హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

సిరిసిల్ల: ఉమ్మడి జిల్లాలోని రాజకీయ దురందరులు అందరూ ఒకప్పటి సర్పంచులే. రాజకీయ తెరంగేట్రానికి తొలిమెట్టును ఆధారంగా చేసుకొని అంచెలంచెలుగా ఎదిగిని వారు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చాలా మంది ఉన్నారు. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎమ్మెల్యేలుగా, జెడ్పీ చైర్మన్లుగా, మంత్రులుగా, స్పీకర్‌లుగా ఎదిగారు. ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా తొలి అడుగు మాత్రం పల్లె పెద్దగానే పడింది. తమ రాజకీయ జీవితాలకు సర్పంచ్‌ పదవిని పునాదులు వేసుకున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతల రాజకీయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సర్పంచ్‌ నుంచి మంత్రులుగా..

జిల్లాకు చెందిన పలువురు నేతలు సర్పంచుల నుంచి మంత్రులయ్యారు. జువ్వాడి రత్నాకర్‌రావు, న్యాలకొండ రాంకిషన్‌రావు, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, సుద్దాల దేవయ్యలు రాష్ట్ర మంత్రులుగా పనిచేయగా దుద్దిళ్ల శ్రీపాదరావు స్పీకర్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. ఇలా పల్లె రాజకీయాల్లో తొలి అడుగులు వేసిన నేతలు కాలక్రమంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేసి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించారు.

దేవాదాయశాఖ మంత్రిగా..

ధర్మపురి మండలం తిమ్మాపూర్‌కు చెందిన జువ్వాడి రత్నాకర్‌రావు రెండుసార్లు సర్పంచ్‌గా గెలుపొందారు. 1981 నుంచి 1987 వరకు జగిత్యాల సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా బుగ్గారం నుంచి గెలుపొంది వైఎస్సార్‌ మంత్రివర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు.

కరీంనగర్‌ ఎమ్మెల్యేగా..

కరీంనగర్‌ ఎమ్మెల్యేగా 1989లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వెలిచాల జగపతిరావు అంతకు ముందు రామడుగు మండలం గుండి సర్పంచ్‌గా పనిచేశారు.

జెడ్పీ చైర్మన్‌ వరకు..

మానకొండూరు సర్పంచ్‌గా రెండుసార్లు పనిచేసిన ఆరెపల్లి మోహన్‌ అనంతరం జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అయ్యారు. 2009లో మానకొండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.

కమ్మరిఖాన్‌పేట సర్పంచ్‌గా..

ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేటకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి 1988 నుంచి 1995 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. ధర్మారం మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా 1995లో ధర్మారం జెడ్పీటీసీగా గెలుపొందారు. 1999లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు.

గంగాధర సర్పంచ్‌గా..

గంగాధరకు చెందిన న్యాలకొండ రాంకిషన్‌రావు 1985 వరకు సర్పంచ్‌గా, సమితి ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. చొప్పదండి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలిచిన ఆయన 1995లోమంత్రి అయ్యారు.

పల్లె నుంచి అసెంబ్లీకి1
1/10

పల్లె నుంచి అసెంబ్లీకి

పల్లె నుంచి అసెంబ్లీకి2
2/10

పల్లె నుంచి అసెంబ్లీకి

పల్లె నుంచి అసెంబ్లీకి3
3/10

పల్లె నుంచి అసెంబ్లీకి

పల్లె నుంచి అసెంబ్లీకి4
4/10

పల్లె నుంచి అసెంబ్లీకి

పల్లె నుంచి అసెంబ్లీకి5
5/10

పల్లె నుంచి అసెంబ్లీకి

పల్లె నుంచి అసెంబ్లీకి6
6/10

పల్లె నుంచి అసెంబ్లీకి

పల్లె నుంచి అసెంబ్లీకి7
7/10

పల్లె నుంచి అసెంబ్లీకి

పల్లె నుంచి అసెంబ్లీకి8
8/10

పల్లె నుంచి అసెంబ్లీకి

పల్లె నుంచి అసెంబ్లీకి9
9/10

పల్లె నుంచి అసెంబ్లీకి

పల్లె నుంచి అసెంబ్లీకి10
10/10

పల్లె నుంచి అసెంబ్లీకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement