నామినేషన్ల ప్రక్రియ పరిశీలన
కరీంనగర్ అర్బన్/కరీంనగర్ రూరల్/కరీంనగర్ క్రైం/కరీంనగర్ టౌన్/రామడుగు/గంగాధర: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే పలు నామినేషన్ కేంద్రాలను గురువారం ఎన్నికల పరిశీలకుడు చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్ప తి, సీపీ గౌస్‌ఆలం పరిశీలించారు. రామడుగు మండలంలోని గోపాల్‌రావుపేట, రామడుగులో, కరీంనగర్ రూరల్ మండలంలో నామినేషన్ల ప్రక్రియను చంద్రశేఖర్‌రెడ్డి తనిఖీ చేశారు. నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ అఽశ్విని తానాజీ వాకడేతో సమావేశమై ఎన్నికల పరిస్థితిని సమీక్షించారు.
కలెక్టర్, సీపీ పరిశీలన
రామడుగు మండలం వెదిరలో నామినేషన్ల నిర్వహణ తీరును కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. బీఎల్‌వోను ఓటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీపీ గౌస్ ఆలం రామడుగు, గంగాధర మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు సజావుగా సాగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
నామినేషన్ల ప్రక్రియ పరిశీలన


