అరుణాచలం గిరిప్రదక్షిణకు ప్రత్యేక బస్సు | - | Sakshi
Sakshi News home page

అరుణాచలం గిరిప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

Nov 26 2025 6:37 AM | Updated on Nov 26 2025 6:37 AM

అరుణాచలం గిరిప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

అరుణాచలం గిరిప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ కరీంనగర్‌–1 డిపో నుంచి అరుణాచలం గిరిప్రదక్షిణకు డిసెంబర్‌ 2న ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు డిపో మేనేజర్‌ విజయమాధురి తెలిపారు. 2న మధ్యాహ్నం 2.30గంటలకు కరీంనగర్‌ నుంచి బయలుదేరి 3న కాణిపాకం, గోల్డెన్‌ టెంపుల్‌ దర్శనం అనంతరం అదే రోజు రాత్రి అరుణాచలం చేరుతుందని, 4న గిరిప్రదక్షిణ, మహాదీపం దర్శనం అనంతరం మధ్యాహ్నం బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం, 5న సాయంత్రం కరీంనగర్‌ చేరుకుంటుందని పేర్కొన్నారు. పెద్దలకు రూ.4,700, పిల్లలకు రూ.3,540 టికెట్‌ ఉంటుందన్నారు. వివరాలకు 73828 49352, 99592 25920, 80746 90 491 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో టు డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement