ఏదీ ప్రోత్సాహకం! | - | Sakshi
Sakshi News home page

ఏదీ ప్రోత్సాహకం!

Nov 14 2025 8:21 AM | Updated on Nov 14 2025 8:21 AM

ఏదీ ప

ఏదీ ప్రోత్సాహకం!

శుక్రవారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 ● కులాంతర వివాహాలకు నిధుల లేమి ● నాలుగేళ్లుగా అందని ఆర్థిక సాయం ● పట్టని అధికార గణం విద్యార్థులు సోదర భావంతో మెలగాలి ● శాతవాహనలో యాంటీ ర్యాగింగ్‌పై అవేర్‌నెస్‌ బీసీ జేఏసీ ధర్మపోరాట దీక్ష

న్యూస్‌రీల్‌

నేడు పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌

మౌలిక వసతులపై సమీక్ష

ప్రచారం చేస్తున్నాం

శుక్రవారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2025
ఆదర్శ వివాహం

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): విద్యార్థులు సోదరభావంతో మెలగాలని శాతవాహన వర్సిటీ రిజి స్ట్రార్‌ ప్రొఫెసర్‌ జాస్తి రవికుమార్‌ అన్నారు. గురువారం వర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో యాంటీ ర్యాగింగ్‌, మహిళా భద్రత, మాదకద్రవ్య నియంత్రణపై సదస్సు నిర్వహించారు. ర్యాగింగ్‌కు పాల్పడినట్టు తెలిస్తే కాలేజీ నుంచి డిస్మిస్‌ చేయడమే కాకుండా పోలీస్‌ కేసు నమోదు చేస్తారని తెలిపారు. కొత్తపల్లి సీఐ కోటేశ్వర్‌ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. డ్రగ్స్‌ వాడితే జీవితం నాశనమవుతుందన్నారు. డ్రగ్స్‌ వాడడం.. అమ్మడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సూరపల్లి సుజాత, షీటీం సీఐ శ్రీలత, కామర్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ హరికాంత్‌, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రమాకాంత్‌, నజీమొద్దీన్‌ మునవర్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యానగర్‌(కరీంనగర్‌): బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ గురువారం కలెక్టరేట్‌ వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్యగౌడ్‌ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ ధర్మ పోరాట దీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు దొగ్గలి శ్రీధర్‌, జీఎస్‌.ఆనంద్‌, దేవరకొండ సంతోషిలక్ష్మి, మంతెన కిరణ్‌, వాయిల రాజ్‌కుమార్‌, గుమ్మడి శ్రీనివాస్‌, ఆశిష్‌గౌడ్‌, తిరుపతి, రవీంద్ర చారి, రామ్మూర్తి , నితిన్‌ పాల్గొన్నారు.

సమీక్ష సమావేశం

విద్యానగర్‌(కరీంనగర్‌): కరీంనగర్‌ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ఆవరణలోని సమావేశ మందిరంలో కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పగిడిమర్రి సోలమన్‌ గురువారం జోన్‌ పరిధిలోని రీజినల్‌ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్‌ మేనేజర్లు, డిప్యూటీ చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, వర్క్స్‌ మేనేజర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రీజియన్‌లో పనితీరు, ఆర్థిక పరిస్థితి, ప్రమాదాలు, నివారణ చర్యలు, మేడారం జాతరకు సన్నద్ధతను సమీక్షించి తగిన సూచనలిచ్చారు.

1 నుంచి డీఈఐఈడీ పరీక్షలు

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): డీఈఐఈడీ మొద టి సంవత్సరం పరీక్షలు డిసెంబర్‌ ఒకటి నుంచి 6వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి గురువారం తెలిపారు. కరీంనగర్‌లోని పురాతన పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్షలు జరుగనున్నట్లు పేర్కొన్నారు.

కరీంనగర్‌టౌన్‌ :

మాజంలో అంతరాలను తగ్గించేందుకు.. కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇస్తున్న రూ.50వేల ప్రోత్సాహకాన్ని ఐదు రేట్లు పెంచింది. 2019 నవంబర్‌ 1 నుంచి ఆ మొత్తాన్ని రూ.2.50లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో విస్తృతమైన ప్రచారం లేకపోవడంతో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోవాల్సింది పోయి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నాలుగేళ్లుగా ద రఖాస్తు చేసుకొని ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్న జంటలకు నిరుత్సాహమే మిగులుతోంది.

విడుదల కాని బడ్జెట్‌

ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ ఆఫీస్‌లో వివాహ ప్రోత్సాహకానికి 2021 డిసెంబర్‌ 1 నుంచి 315 జంటలు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోగా.. ఇప్పుటివరకు కేవలం 111 జంటలకు ప్రోత్సాహకం అందించారు. నిధుల లేమి కారణంగా మరో 204 జంటలకు ప్రోత్సాహకాలు అందించలేకపోయారు. కు లాంతర వివాహాలు ఈ రోజుల్లో సాధారణ అంశంగా మారగా.. ప్రోత్సాహకాన్ని ఐదు రేట్లు పెంచడంతో యువత మొగ్గు చూపేందుకు ఆస్కారముంది.

అధికారుల అలసత్వం..

ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఏ ఇతర సా మాజిక వర్గానికి చెందిన వారిని వివాహం చేసుకున్నా.. కులాంతర వివాహం ప్రోత్సాహక పథకం వర్తిస్తుంది. 2011 వరకు కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రూ.10వేలు, 2012 నుంచి రూ.50వేల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2019 నవంబర్‌ నుంచి రూ.2.5లక్షలు అందజేస్తున్నాయి. ఈ మొత్తాన్ని దంపతుల జాయింట్‌ అకౌంట్‌లో మూడేళ్ల కాలానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. అయితే అమలులో ప్రభుత్వాధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.

తనిఖీలు ముమ్మరం.. భద్రత కట్టుదిట్టం

కరీంనగర్‌క్రైం: ఢిల్లీ పేలుళ్ల ఘటనతో కరీంనగర్‌ పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. ప్రజల భద్రత దృష్ట్యా కొన్ని రోజులుగా సిటీలో ముమ్మరంగా తనిఖీలు చేస్తూ భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కరీంనగర్‌ బస్టాండులోని కార్గో విభాగం వద్ద కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు.

కరీంనగర్‌: చిల్డ్రన్స్‌ డే సందర్భంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో టీచర్స్‌, పేరెంట్స్‌ సమావేశాలు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలతోపాటు కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో మన పిలల్లకు ఆనందకరమైన బాల్యాన్ని అందించడం థీమ్తో సమావేశాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

చర్చించాల్సిన అంశాలివే..

విద్యార్థుల చదువులో పురోగతి, హాజరు, అలవాట్లు, సమస్యలపై చర్చించాలి. విద్యాప్రమాణాలు, మధ్యాహ్న భోజనం మెరుగుపరచడం, వసతులపై నివేదిక ఇవ్వాలి.

విద్యార్థులకు అందించాల్సిన సాయం, హోంవర్క్‌ పూర్తి చేయడం, పిల్లల ప్రవర్తన, ఆసక్తులపై సమీక్షించొచ్చని విద్యాశాఖ తెలిపింది. ఫలితంగా విద్యానాణ్యత మెరుగుపడి అభ్యాస ఫలితాల సాధనకు దోహదం చేస్తుంది. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో తల్లిదండ్రులు సైతం ప్రధాన పాత్ర పోషించొచ్చు.

204 జంటలకు బడ్జెట్‌ రాగానే అందజేస్తాం.. తల్లిదండ్రుల మద్దతు లేకుండా పెళ్లి చేసుకున్న జంటలు ఈ ప్రోత్సాహంతో వారి జీవితంలో స్థిరపడేందుకు అవకాశముంది. ఈ ప్రోత్సాహకంపై అవగాహన కల్పించేందుకు శాఖ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్నాం. నిర్దిష్ట తేదీల్లో ప్రత్యేక శిబిరాలు, స్టాళ్లు ఏర్పాటు చేసి పథకంపై ప్రచారం చేస్తున్నాం. – నాగైలేశ్వర్‌, జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి

ఏదీ ప్రోత్సాహకం!1
1/5

ఏదీ ప్రోత్సాహకం!

ఏదీ ప్రోత్సాహకం!2
2/5

ఏదీ ప్రోత్సాహకం!

ఏదీ ప్రోత్సాహకం!3
3/5

ఏదీ ప్రోత్సాహకం!

ఏదీ ప్రోత్సాహకం!4
4/5

ఏదీ ప్రోత్సాహకం!

ఏదీ ప్రోత్సాహకం!5
5/5

ఏదీ ప్రోత్సాహకం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement