16న ప్రతిభా పరీక్ష
విద్యానగర్(కరీంనగర్): పదో తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు, వారికి ఉన్నత విద్యావకాశాలతో పాటు మంచి భవిష్యత్ అందించడానికి ఈనెల 16న ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. గురువారం ప్రతిభా పరీక్షలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. జ్యోతినగర్‌లోని ఎస్‌ఆర్ జూనియర్ కాలేజీలో బాలికలకు, ముకరంపురలోని ఎస్‌ఆర్ కాలేజీలో బాలురకు ఉదయం 10.30నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇంటర్‌లో ఉచిత ప్రవేశంతో పాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోచింగ్. ప్రోత్సాహక స్కాలర్‌షిప్ అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు ఎస్‌ఆర్ కాలేజీ లేదా 9154854706, 9642117366 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


