24న మెట్‌పల్లిలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
మెట్‌పల్లి: పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 24న మొదటి ఆస్మిత లీగ్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి తెలిపారు. ర్యాలీ విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థినులతో ఆదివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ కరపత్రాలు అందించి పోటీలను విజయవంతం చేయాలని కోరారు. గ్రామీణ బాలికలకు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించడం కోసం దేశ వ్యాప్తంగా 300 జిల్లాలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుల్లా కపిల్, రాందాస్, మరిపెల్లి కార్తీక్ తదితరులున్నారు.


