గుండెపోటుతో లైన్‌మన్ మృతి
మేడిపల్లి: భీమారం మండలం మన్నేగూడెం లైన్‌మన్ ధనుంజయ్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. విధుల్లో ఉన్న ధనుంజయ్ మధ్యాహ్న భోజనానికి ఇంటికొచ్చాడు. చాతిలో నొప్పిగా ఉందని కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ధనుంజయ్‌కు భార్య భావన, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
చికిత్స పొందుతూ గీతకార్మికుడు..
రామడుగు: ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడిపోయిన గీత కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామడుగు ఎస్సై రాజు వివరాల ప్రకారం.. మండలంలోని గుండి గ్రామానికి చెందిన చిలువేరి రాములు గీత కార్మికుడు. శుక్రవారం మధ్యాహ్నం కల్లుగీయడానికి తాటిచెట్టు ఎక్కగా అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో కుటంబసభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది బ్రెయిన్ డెడ్ అయిటన్లు నిర్ధారించారు. తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా ఆదివారం వేకువజామున చనిపోయాడు. మృతుడి కొడుకు చిలువేరి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
జమ్మికుంటలో యువరైతు..
జమ్మికుంట: వర్షాలకు పంట నష్టపోయి, చేసిన అప్పు తీర్చే మార్గంలేక ఓ యువ రైతు పురుగుల మందు తాగగా.. చికిత్స పొందు తూ ఆదివారం చనిపోయా డు. టౌన్ సీఐ రామకృష్ణ వి వరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట గ్రామానికి చెందిన సోమల్ల హరీశ్(28) రెండెకరాల సొంతభూమితో పాటు రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి దిగుబడి రాలేదు. వరి నేలవాలింది. గతంలో రూ.3లక్షల అప్పు ఉండగా, పంట కోసం చేసిన అప్పు రెట్టింపైంది. తీర్చే మార్గం కనిపించకపోవడంతో శనివారం వ్యవసాయ పొలం వద్ద పురుగులు మందు తాగాడు. కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. హరీశ్ తండ్రి సదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
టీ కోసం వెళ్తే.. ప్రాణమే పోయింది
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో రేకులసజ్జ(సబ్–జా) మీదపడి అంతగిరి రాజేశ్వరి(65) ఆదివారం మృతిచెందింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గడబోయిన ఐలమ్మతో రాజేశ్వరికి స్నేహసంబంధం ఉంది. రోజూ టీ తాగేందుకు ఐలమ్మ ఇంటికి వెళ్లింది. ఆమె రాకతో టీ తయారు చేసేందుకు ఐలమ్మ ఇంట్లోకి వెళ్లింది. సజ్జకింద కూర్చున్న రాజేశ్వరి మీద రేకులసజ్జ హఠాత్తుగా కూలింది. ఈఘటనలో రాజేశ్వరి తలపగిలి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు బుచ్చిమల్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
గుండెపోటుతో లైన్‌మన్ మృతి
గుండెపోటుతో లైన్‌మన్ మృతి


