
బస్టాండ్‌లో వ్యక్తిపై దాడి
కరీంనగర్ క్రైం: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి దాడి జరిగింది. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరీంనగర్‌కు చెందిన పరశురాం(58) కూలీ పని చేసుకుంటూ రోడ్లపైన జీవనం సాగిస్తున్నాడు. మద్యం మత్తులో బస్టాండ్ ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు. అక్కడే ఉన్న కొందరు అతనిపై దాడి చేయడంతో చేయి విరిగింది. బాధితుడు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు రావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెయ్యి విరిగిందని, సర్జరీ అవసరమని డాక్టర్లు తెలిపారు. అయితే పోలీసులే తనపై దాడి చేశారని, బాధితుడు తెలపడంతో వన్‌టౌన్ పోలీసులు బస్టాండ్ ఆవరణలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.