
బాస్కెట్ బాల్‌లో కరీంనగర్.. టేబుల్ టెన్నిస్‌లో వరంగల
● ముగిసిన ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్ సర్కిల్ పోటీలు
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ విద్యుత్ భవన్‌లో నిర్వహించిన ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌సర్కిల్ బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. బాస్కెట్‌బాల్ ఓవరాల్ చాపియన్‌గా కరీంనగర్ టీజీఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్స్, టేబుల్ టెన్నిస్ ట్రోఫీని వరంగల్ జట్లు నిలిచాయి. విజయం సాధించిన జట్లకు ట్రాన్స్‌కో కరీంనగర్ జోన్ చీఫ్ ఇంజినీర్లు జె.విజయ్‌కుమార్ పాపారావు ట్రోఫీ అందజేశారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్, స్పోర్ట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు పి.రఘునందన్, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు, వేణుబాబు, డీఈ ఉపేందర్, ఏవో అర్వింద్, పీవో చంద్రయ్య, శ్రీధర్‌రెడ్డి, ఈఎల్‌పీ రాజు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.