
‘ఇందిరమ్మ’ గృహప్రవేశం
● ‘సుడా’ చైర్మన్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం బహుదూర్‌ఖాన్‌పేటలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా శుక్రవారం ఇంటి నిర్మాణం పూర్తయిన ఆకుల రమ్య–రవీందర్ దంపతుల మొదటి గృహప్రవేశం కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. లబ్ధిదారు దంపతులకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి మహేందర్, నాయకులు కె.రాంరెడ్డి, ఎస్.తిరుపతి, జి.బాపురెడ్డి, బి.తిరుపతిగౌడ్, స్వామిగౌడ్, నారాయణగౌడ్, కె.నరేశ్‌రెడ్డి, బి.అంజనేయులు పాల్గొన్నారు.