
మద్దికుంట సబ్‌సెంటర్‌కు స్టాండర్డ్ సర్టిఫికెట్
ముస్తాబాద్: అత్యుత్తమ వైద్య సేవలు అందించినందుకు మద్దికుంట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(సబ్‌సెంటర్) స్టాండర్డ్ సర్టిఫికేట్‌కు ఎంపికై ందని వైద్యాధికారి హఫీజా తెలిపారు. మద్దికుంట సబ్‌సెంటర్‌ను సెప్టెంబర్ 18న రాష్ట్ర బృందం పరిశీలించి ఇక్కడ అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారని అన్నారు. జిల్లాలోనే అత్యుత్తమ ఆరోగ్య ఉపకేంద్రంగా మద్దికుంట ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈమేరకు ఎంఎల్‌హెచ్‌పీ రమ్య, ఏఎన్‌ఎంలు మణేమ్మ, విజయనిర్మల, ఆశ వర్కర్లను జిల్లా వైద్యాధికారి రజిత అభినందించారు.