
కోలిండియా పోటీల్లో సింగరేణికి పతకాలు
గోదావరిఖని(రామగుండం): నాగ్‌పూర్‌లో ఈనెల 14 నుంచి 16 వరకు డబ్ల్యూసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన కోలిండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారులు సత్తాచాటారు.
● పవర్‌లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో ఐదు గోల్డ్, ఆరు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. పవర్‌లిఫ్టింగ్ 59 కేజీల విభాగంలో భూపాల్‌పల్లికి చెందిన బానోతు రమేశ్(ట్రామర్), 120 కేజీల విభాగంలో మీర్జా యాసీన్‌బేగ్ (సీనియర్ అండర్‌మేనేజర్), 93 కిలోల విభాగంలో ఆర్జీవన్‌కు చెందిన పి.వంశీకృష్ణ(జనరల్ అసిస్టెంట్) వెండి, 69 కిలోల ఉమెన్స్ విభాగంలో భూపాల్‌పల్లికి చెందిన డి.అనూష (జనరల్ అసిస్టెంట్) సిల్వర్, 52కిలోల విభాగంలో ఆర్జీ–2 ఏరియాకు చెందిన ఎస్‌కే ఆషియాబేగంబ్రాంజ్ మెడల్ సాధించారు.
● వెయిట్ లిఫ్టింగ్ 71కిలోల విభాగంలో మణుగూరుకు చెందిన కె.అనిల్‌కుమార్(కన్వేయర్ ఆపరేటర్)సిల్వర్, 110 కిలోల విభాగంలో కొత్తగూడెంకు చెందిన పి.పవన్‌కుమార్(ఫిట్టర్) సిల్వర్ మెడల్ సాధించారు.
● బాడీ బిల్డింగ్ పోటీల్లో వంద కిలోల విభాగంలో కొత్తగూడెంకు చెందిన పి.పవన్‌కుమార్(ఫిట్టర్) గోల్డ్, 55 కిలోల విభాగంలో ఎం.అంజయ్(జనరల్ అసిస్టెంట్) సిల్వర్, 70కిలోల విభాగంలో ఆర్జీ–3 ఏరియాకు చెందిన ఆర్.అర్జున్(ఈపీఆపరేటర్) బ్రాంజ్, 75 కిలోల విభాగంలో బెల్లంపల్లికి చెందిన జె.మొగిలి(ఈపీఆపరేటర్) సిల్వర్, 80కిలోల విభాగంలో కొత్తగూడెంకు చెందిన ఎం.రామకృష్ణ(అసిస్టెంట్ చైన్‌మెన్) గోల్డ్, 85కిలో ల విభాగంలో భూపాల్‌పల్లికి చెందిన ఎస్.శ్రీనివాస్‌రెడ్డి(కోల్‌కట్టర్) గోల్డ్‌మె, వందకిలోల విభాగంలో మందమర్రికి చెందిన బి.వెంకటస్వామి(ఏఎస్‌ఎం) సిల్వర్ మెడల్ సాధించారు. వీరిని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ అభినందించారు.
ఐదు గోల్డ్, ఆరు సిల్వర్, మూడు బ్రాంజ్ పతకాలు

కోలిండియా పోటీల్లో సింగరేణికి పతకాలు