
గెలుపే లక్ష్యంగా ఆటల్లో రాణించాలి
● శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ రమేశ్‌రెడ్డి
తిమ్మాపూర్: ఎస్జీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అండర్–19 జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు శ్రీచైతన్య కళాశాలలో మంగళవారం ప్రారంభమయ్యాయి. కళాశాల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. ప్రతి క్రీడాకారుడు గెలుపే లక్ష్యంగా రాణించాలని సూచించారు. ఆటల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎస్జీఎఫ్‌ఐ సెక్రటరీ వేణుగోపాల్, జూనియర్ కళాశాలల డీన్ జగన్మోహన్‌రెడ్డి, డిఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ శ్యాంసుందర్‌రెడ్డి, ఏజీఎంలు శ్రీనివాస్ పాల్గొన్నారు.