
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాసీ్త్రనగర్ పెట్రోల్ బంక్ సమీపంలో రాజీవ్ రహదారిపై మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఆరెపల్లి గ్రామానికి చెందిన బావు కొమురయ్య(79) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని ఆరెపల్లికి చెందిన కొమురయ్య శాసీ్త్రనగర్‌లోని ఎస్‌బీఐలో పింఛన్ డబ్బులు తీసుకునేందుకు మంగళవారం వచ్చాడు. డబ్బులు తీసుకొని స్వగ్రామానికి వెళ్లేక్రమంలో రోడ్డు దాటుతుండగా కరీంనగర్ నుంచి మంచిర్యాలకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కొడుకు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
బావిలో పడి యువకుడు..
సైదాపూర్: సైదాపూర్ మండలం గొడిశాలలో వల్లెపు రాకేశ్(25) ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వల్లెపు సంపతి– పద్మ కుమారుడు రాకేశ్ చదువు ఆపేసి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నెల 12న రాత్రి సినిమాకు వెళ్తున్నానని, ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. మరునాడు సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం ఊరి పక్కన వ్యవసాయబావిలో శవమై తేలాడు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
అనుమానాస్పదంగా ఒకరు..
మంథని: మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి ఇటుకబట్టీ సమీపంలో నీటిగుంతలో పడి స్వర్ణపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల మహేశ్(35) అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికంగా సెల్ఫ్‌మోటార్లు మరమ్మతు చేసే వ్యక్తి వద్ద అసిస్టింట్‌గా పనిచేస్తున్న మహేశ్.. సోమవారం ఇటుకబట్టీ వద్ద మరమ్మతు చేసేందుకు వెళ్లాడు. కడుపులో నొప్పిగా ఉందని చెప్పి బహిర్భూమికి వెళ్తానని తిరిగి రాలేదు. నీటిగుంతలో పడి చనిపోయి ఉన్నాడు. బయటకు తీసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
కరీంనగర్ క్రైం: కరీంనగర్‌లోని ముకరంపురంలో వ్యభిచార గృహంపై మంగళవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు దాడి చేశారు. వారి వివరాల ప్రకారం.. ముకరంపురలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. రూ.1,100 నగదు, సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. నిర్వాహకుడు ఉప్పుల వెంకటరాజం పాటు ఇంటి యజమాని రిజ్వా న్‌పై కేసు నమోదు చేశారు.