
గంజాయి విక్రేత అరెస్ట్
మేడిపల్లి: మండల శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద 200 గ్రాముల గంజాయి దొరికినట్లు ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి తెలిపారు. సదరు నిందితుడిని కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన బద్దం నాగరాజుగా గుర్తించామన్నారు. ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు అమ్మినా.. సహకరించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి విక్రేతను పట్టుకున్న ఎస్త్సె, కానిస్టేబుల్ నాగరాజును ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల సీఐ సురేష్‌బాబు అభినందించారు.