
ఆపదలో ఆదుకునే రక్తదాతలు
ముప్పైసార్లు రక్తదానం చేశా
అనారోగ్య సమస్యలు రావు
బోయినపల్లి(చొప్పదండి): ఆపదలో పలువురికి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బోయినపల్లి మండలానికి చెందిన పలువురు యువకులు. బోయినపల్లి, బూర్గుపల్లి, తడగొండ, గుండన్నపల్లి గ్రామాలకు చెందిన యువకులు కొన్నేళ్లుగా రక్తదానం చేస్తున్నారు. బుధవారం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా కథనం.
రక్తదానంలో ముందుండే యువత
బోయినపల్లి, బూర్గుపల్లి, తడగొండ, గుండన్నపల్లి, కొదురుపాక, వరదవెల్లి గ్రామాలకు చెందిన యువకులు రక్తం అవరమైన వారి నుంచి ఎలాంటి సాయం తీసుకోకుండా రక్తదానం చేస్తున్నారు. ఒక్కొక్కరు 25 సార్లకుపైగా రక్తదానం చేసిన సందర్భాలు ఉన్నాయి. కొదురుపాకకు చెందిన నల్ల సతీశ్ 31 సార్లు, బూర్గుపల్లికి చెందిన పెరుక మహేశ్ 29, నలిమెల అరవింద్ 18, వడ్లకొండ వినయ్ 9, గుండన్నపల్లికి చెందిన నంది మహేశ్ 18, బోయినపల్లికి చెందిన శ్రీపతి సాగర్ 10, యాద ఆదిత్య 10, తడగొండకు చెందిన ఎర్ర గిరిధర్ 17 సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు.
కొన్నేళ్లుగా బాధితులకు రక్తదానం చేస్తూ..
ఆదర్శంగా నిలుస్తున్న బోయినపల్లి మండల యువకులు
నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం
రక్తదానం చేయడం అలవాటుగా మారింది. ఎవరైనా రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే వెంటనే వెళ్లి ఇస్తాను. 12 ఏళ్లుగా రక్తదానం చేస్తున్నా. సమయానికి రక్తం దొరక్క ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటి వరకు 30 సార్లు రక్తదానం చేశాను.
– పెరుక మహేశ్, బూర్గుపల్లి
సమాజంలో కొంత మందికి రక్తదానం చేస్తే అనారో గ్యాల బారిన పడుతామనే అపోహ ఉంది. ఈ అపోహను పోగొట్ట డానికే రక్తదానం చేస్తున్నా. మరి కొంతమంది యువకులు రక్తదానం చేసేలా వారికి నా వంతు అవగాహన కల్పిస్తున్నా. 24 సార్లు బ్లడ్ డొనేట్ చేశా.
– నంది మహేశ్, గుండన్నపల్లి

ఆపదలో ఆదుకునే రక్తదాతలు

ఆపదలో ఆదుకునే రక్తదాతలు