
శ్రమించారు.. సాధించారు
కోల్‌సిటీ(రామగుండం): పట్టుదలతో చదివారు.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళిక రూపొందిచుకున్నారు. ఇష్టపడి చదివారు.. గ్రూప్–2 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఒకరు డిప్యూటీ తహసీల్దార్‌గా, మరొకరు ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. వీరిద్దరూ ఇప్పటికే రామగుండం నగరపాలక సంస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వార్డు ఆఫీసర్‌కు గ్రూప్–2 జాబ్..
గోదావరిఖనిలోని గౌతమినగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ ఆశాడపు రాంచందర్–పద్మ దంపతుల కుమారుడు రవివర్మ గ్రూప్–2 ఫలితాల్లో సత్తాచాటారు. డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం రామగుండం నగరపాలక సంస్థలో వార్డు ఆఫీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బీటెక్ మెకానికల్ కోర్సు పూర్తిచేసిన రవివర్శ.. 2023లో రాసిన గ్రూప్–4లో వార్డు ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు గ్రూప్–2కు ప్రిపేర్ అయ్యారు. 2024 డిసెంబర్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో సత్తాచాటారు. కుటుంబ సభ్యులు, బల్దియా ఉద్యోగులు, పలువురు అభినందించారు.
ఎకై ్సజ్ ఎస్సైగా జూనియర్ అసిస్టెంట్
గోదావరిఖని పరశురాంనగర్‌కు చెందిన సింగరేణి ఉద్యగి సాగరపు శ్రీనివాస్–రమాదేవి దంపతుల కుమారుడు సాయి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. బీటెక్ మైనింగ్ కోర్సు పూర్తిచేసిన సాయి.. తొలత గ్రూప్–1, 2, 3, 4 వరకు వరుసగా పరీక్షలు రాశారు. గ్రూప్–4లో ఫలితాల్లో సత్తాచాటారు. ప్రస్తుతం రామగుండం నగరపాలక సంస్థలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2024లో గ్రూప్–2 పరీక్ష రాసిన సాయి.. ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. ఎకై ్సజ్ ఎస్సైగా విధుల్లో చేరి గ్రూప్–1 ఉద్యోగ సాధనకు ప్రిపేర్ అవుతానని చెబుతున్న సాయి ప్రతిభను కుటుంబ సభ్యులతోపాటు పలువురు అభినందిస్తున్నారు.
గ్రూప్–2 ఉద్యోగాలు సాధించిన యువకులు
ఒకరు డిప్యూటీ తహసీల్దార్, మరొకరు ఎకై ్సజ్ ఎస్సై
ఇప్పటికే బల్దియాలో పనిచేస్తున్న యువకులు

శ్రమించారు.. సాధించారు