
బతుకమ్మపై మాజీ సీఎం కేసీఆర్ పేరు
బీఆర్‌ఎస్ నాయకుడు, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి బతుకమ్మపై రంగులతో మాజీ సీఎం కేసీఆర్ పేరును అద్ది అభిమానాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన మల్లారెడ్డి– సుమలత దంపతులు బతుకమ్మను పేర్చి కేసీఆర్ పేరు వచ్చేలా తీర్చిదిద్ది అబ్బురపర్చారు. గ్రామస్తులు, బీఆర్‌ఎస్ నాయకులు బతుకమ్మను చూసి సంబరపడ్డారు. – ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల)
బతుకమ్మపై సీఎం కేసీఆర్ పేరుతో
అభిమానం చాటుకున్న మల్లారెడ్డి