
ఆరు ఉద్యోగాల అశ్విని
సారంగాపూర్(జగిత్యాల): బీర్‌పూర్ మండలం తాళ్ళధర్మారం గ్రామానికి చెందిన శనిగారపు అశ్విని గ్రూప్– 2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించింది. తల్లిదండ్రులు మల్లయ్య, లక్ష్మి. వ్యవసాయ కుటుంబం. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి, తుంగూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదివింది. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్, ఉస్మానియాలో ఎంటెక్ చేసి, ప్రభుత్వ ఉద్యోగ సాధనకు ప్రణాళితో చదివింది. మొదట పంచాయతీ సెక్రటరీ, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, రైల్వే ఎస్సై, సివిల్ ఎస్సై ఉద్యోగాలు సాధించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ట్రైనీ ఎస్సైగా శిక్షణ పొంది అక్కడే బాధ్యతలు చేపట్టింది. అనంతరం వరంగల్ సీఐడీ విభాగానికి బదిలీపై వెళ్లి గ్రూప్– 1కు ప్రిపేర్ అయ్యింది. ప్రస్తుతం గ్రూప్– 2లో ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా అశ్విని సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో బోధనతోనే తాను ఈ స్థాయికి చేరానని చెప్పింది.