
మహిళలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి
కరీంనగర్: రాష్ట్ర మహిళలకు బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని తెలంగాణచౌక్‌లో బీఆర్‌ఎస్ నగరశాఖ ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ ఆడుతూ వినూత్న నిరసన చేపట్టారు. అనిల్ కుమార్‌గౌడ్, గందె మాధవి, ఎడ్ల సరిత, గుగ్గిళ్ల జయశ్రీ, నక్క పద్మ, నందెల్లి రమాదేవి, మర్రి భావన, తాటి ప్రభావతి, వాల రమణారావు, కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతి, మహేశ్, శ్రీకాంత్, రాములు, ఏవీ రమణ, ఐలేందర్‌యాదవ్ పాల్గొన్నారు.