
ఆటోట్రాలీ ఢీకొని బాలుడు మృతి
ముత్తారం(మంథని): ముత్తారంలోని కాసార్లగడ్డకు చెందిన తిరునహరి శ్రీనివాస్, మంజుల వికలాంగ దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు ఆటోట్రాలీ ఢీకొని మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శ్రీనివాస్, మంజుల దంపతులు పొట్టకూటి కోసం కాసార్లగడ్డలో టీ స్టాల్ నడిపిస్తున్నారు. ఆదివారం టీ స్టాల్‌లో తల్లిదండ్రులు ఉండగా, బయట ఆడుకుంటున్న వీరి కుమారుడు ఆయూష్ సిదార్థ్‌ను ఆటోట్రాలీ రివర్స్ తీస్తుండగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫిర్యాదు అందలేదని ఎస్సై రవికుమార్ పేర్కొన్నారు.