
సాగు నుంచి ఉద్యోగాల వైపు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తల్లిదండ్రులతోపాటు వ్యవసాయం చేస్తూ మూడు ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు మహేశ్. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు చెందిన సిర్రం మల్లవ్వ–అంజయ్య దంపతులకు ముగ్గురు సంతానం. చిన్నకుమారుడు మహేశ్ గ్రూప్–2లో రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ అధికారిగా ఎంపికయ్యాడు. గతంలో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తూనే గ్రూప్–4 రాసి జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం పదోన్నతి పొంది వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యుల సహకారంతోనే మూడు ఉద్యోగాలు సాధించినట్లు మహేశ్ తెలిపాడు.