
గీత కార్మికుడి ఇంట ఎకై ్సజ్ ఎస్సై
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని పోతుగల్‌కు చెందిన బత్తిని అంజాగౌడ్, అండాలు రెండో కుమారుడు రఘు గ్రూప్–2లో 600 మార్కులకు 384 సాధించి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. తండ్రి గీత కార్మికుడు, తల్లి బీడీ కార్మికురాలు. ముస్తాబాద్‌లో పదో తరగతి, సిద్దిపేటలో ఇంటర్, కరీంనగర్‌లో బీటెక్ 2014లో పూర్తి చేశాడు. మొదట అటవీశాఖలో బీట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. అనంతరం గ్రూప్–4, పంచాయతీ కార్యదర్శి, రైల్వేస్, కేంద్ర ప్రభుత్వ ఎస్‌ఎస్‌సీలాంటి ఉద్యోగాలు సాధించాడు. వీఆర్వో జాబ్ ఎంచుకుని ప్రస్తుతం సిరిసిల్ల కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.