
తల్లిదండ్రుల సహకారంతో..
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలకేంద్రానికి చెందిన మూటపల్లి తిరుపతి– భారతి దంపతుల కూతురు దివ్యశ్రీ మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో నాయబ్ తహసీల్దార్ ఉద్యోగం సాధించింది. ప్రాథమిక విద్య ధర్మారంలో, పదో తరగతి వరకు నవోదయ, ఇంటర్ కరీంనగర్, బీటెక్ సీబీఐటీలో చదివింది. గ్రూప్– 4లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించి కరీంనగర్‌లో, ప్రస్తుతం ధర్మారం తహసీల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుంది. తల్లిదండ్రుల సహకారంతోనే ఉద్యోగం సాధించినట్లు దివ్యశ్రీ చెప్పింది.