
కుటుంబపోషణ కష్టమే..
పాతికేళ్లుగా పశువులకు సేవలందిస్తున్న తమకు అందించే వేతనమే తక్కువ. అయినా ఆ వేతనాలను రెగ్యులర్‌గా అందించడం లేదు. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి వేతనాలు సకాలంలో ఇచ్చేలా చూడాలి.
– గోపతి ప్రవీణ్, గోపాలమిత్ర
గోపాలమిత్రలుగా పనిచేస్తున్న వార ంతా పేద, మధ్యతరగతి వ ర్గాలకు చెందిన వారే. అరకొర వేతనంపై ప నిచేస్తున్న తమకు ఆ వేతనాన్ని కూ డా ప్రతినెలా చెల్లించేలా చూడాలి. బకాయి ఉన్న ఆరునెలల వేతనాలను దసరా పండగకు ముందే ఇప్పించి ఆదుకోవాలి. ప్రభుత్వం ఈ దిశగా చొరవచూపాలి. – కల్వల శ్రీనివాస్,
గోపాలమిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి
గోపాలమిత్రలుగా పనిచేస్తున్నవారికి ఈ ఏడాది మార్చి వరకు వేతనాలు చెల్లించాం. ఏప్రిల్ నుంచి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి నిధులు అందగానే చెల్లిస్తాం.
– సత్యప్రసాదరెడ్డి,
ఈఓ, పశుగణాభివృద్ది సంస్థ

కుటుంబపోషణ కష్టమే..