
జీఎస్టీ తగ్గింది.. సందడి పెరిగింది
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను సడలించిన నేపథ్యంలో పలు వస్తువుల ధరలు తగ్గాయి. ఈనెల 22 నుంచి తగ్గిన ధరలు అమల్లోకి రాగా.. మార్కెట్లో తాకిడి పెరిగింది. ముఖ్యంగా టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రికల్ వస్తువులతో పాటు బైక్‌లు, కార్ల షోరూముల్లో సందడి కనిపించింది. నగరంలోని పలు వాహనాల షోరూములతో పాటు స్టోర్లలో వినియోగదారుల రద్దీ ఉంది. ఇటు పండుగ ఆఫర్లు.. అటు జీఎస్టీ తగ్గడంతో గిరాకీ పెరిగిందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్