
ప్రతిభ వెలికితీసేందుకు ‘అల్ఫోర్స్ అటెంప్ట్ 2025’
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి అల్ఫోర్స్ అటెంప్ట్ పరీక్ష నిర్వహించినట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్‌లో సోమవారం నిర్వహించిన ‘అల్ఫోర్స్ అటెంప్ట్ 2025’ పరీక్ష ప్రారంభించి మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఈ పరీక్షకు 634 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షా ఫలితాలను రెండురోజుల్లో విడుదల చేసి ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహాలతో పాటు విద్యాసంస్థలో విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, వివిధ పాఠశాలల యజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎల్‌ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి: మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి 2,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఎస్సారెస్పీ నుంచి 4,500, మరో 2 వేల క్యూసెక్కుల మేర వరద ఇన్‌ఫ్లోగా చేరుతోంది. మిడ్‌మానేరు నుంచి ప్యాకేజీ–9కి 561, ప్యాకేజీ–10 అనంతగిరికి 3,200 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 27.248 టీఎంసీలకు చేరింది.

ప్రతిభ వెలికితీసేందుకు ‘అల్ఫోర్స్ అటెంప్ట్ 2025’