
మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పదమూడేళ్లుగా ఆ యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు యువకుడి ప్రాణాలు కాపాడడానికి ఆస్పత్రుల్లో రూ.10లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా చివరికి అతను ఓడిపోయాడు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విషాదం నింపింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన జోగుల నాంపెల్లి(41) పెట్రోల్‌పంపులో పనిచేస్తుండేవాడు. కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చూపించగా జాండీస్ వ్యాధికి గురైనట్లు వైద్యులు తెలిపారు. దీంతో పలు ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. ఈక్రమంలోనే షుగర్ వ్యాధికి గురయ్యాడు. 13 ఏళ్లుగా వివిధ ఆస్పత్రుల్లో వైద్యం పొందడానికి మిత్రులు, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 లక్షలు ఖర్చుచేశారు. కాగా ఇటీవల రెండు మూత్రపిండాలు(కిడ్నీలు) పాడవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. అంత్యక్రియలకు సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి రూ.5వేలు సాయం అందించారు.
రూ.10 లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం
13 ఏళ్లు మృత్యువుతో పోరాటం
ఎల్లారెడ్డిపేటలో విషాదం