
ఘనంగా బతుకమ్మ వేడుకలు
బీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని మహాత్మజ్యోతిబాపులే మైదానంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తులఉమ ఆడిపాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి, మాజీ కార్పొరేటర్లు, మహిళలు పాల్గొన్నారు. లోయర్ డ్యాంలోని లేక్ పోలీస్ స్టేషన్ వద్ద మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. – కరీంనగర్ కల్చరల్