
కాళేశ్వరం దోపిడీ రూ.లక్షా 15 వేల కోట్లు
కరీంనగర్‌కార్పొరేషన్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ కుటుంబం రూ.లక్షా 15 వేల కోట్లు దోచుకుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.35 వేల కోట్లతో పూర్తయితే, రూ.1లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేసీఆర్ చెబుతున్నారన్నారు. హరీశ్‌రావు, సంతోష్‌రావు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని కవిత చెప్పారని, అవినీతి వాస్తవాలు సొంత కుటుంబం నుంచే వస్తుంటే, కేటీఆర్ సీఎంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సచివాలయం నిర్మిస్తున్న సమయంలో దొరికిన నిజాంకు చెందిన బంగారం, వజ్రాలు, హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ బినామీ పేరిట ఉన్న 30 వేల ఎకరాల భూములు, ఆస్తుల పంపకాల్లో కేటీఆర్‌తో సమానంగా తనకు వాటా కావాలనే కవిత పంచాయితీ మొదలైందని ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యమకారులకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కుటుంబం మాత్రం రూ.3 లక్షల కోట్లు దండుకుందని మండిపడ్డారు. గతంలో ఇళ్లు కూడా సరిగాలేని కేసీఆర్ కుటుంబానికి అమెరికా, దుబాయి, లండన్, సింగాపూర్‌లో రూ.వేలకోట్ల ఆస్తులు, వ్యాపారాలు ఎక్కడివని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు సముద్రాల అజయ్, గోష్కి శంకర్ పాల్గొన్నారు.
సంఘటితంగా ముందుకెళ్లాలి
కరీంనగర్: అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా రాజ్యాంగ ఫలాలను పునికి పుచ్చుకునేందుకు సంఘటిత శక్తితో ముందుకు సాగాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా అంబేద్కర్ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. రాజకీయ పార్టీల్లో ఉన్న దళిత వర్గాలు దళిత శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని, పొరపచ్చాలు లేకుండా ముందుకు సాగా లని పిలుపునిచ్చారు. నాయకులు గజ్జల ఆనంద్‌రావు, సుద్దాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం